Pawan Kalyan: సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఆసక్తికర పోస్టు

Pawan Kalyan reveals his thoughts in Social Media
  • ట్విట్టర్ లో పవన్ స్పందన
  • మార్పు కోసం యుద్ధం చేస్తానని వెల్లడి
  • అయితే 99 సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తానని వివరణ
  • 100వ సారి యుద్ధం చేస్తానని స్పష్టీకరణ
ఇటీవల కాలంలో ఏపీ సర్కారుతో తీవ్ర పోరాటం చేస్తున్న జనసేనాని, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశారు. ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తానని, 100వ సారే యుద్ధం చేస్తానని తన వైఖరిని చాటారు. ఈ మేరకు పెన్సిల్ ఆర్ట్ పిక్ ను పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. 

సినిమా టికెట్ల ధరల అంశంలో ఏపీ ప్రభుత్వంపై గతంలో పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ రిలీజ్ కాగా, ప్రతి థియేటర్ వద్ద ఏపీ సర్కారు రెవెన్యూ అధికారులను మోహరించి, సినిమా టికెట్లు ప్రభుత్వ జీవో ప్రకారమే అమ్ముడయ్యేలా చర్యలు తీసుకుంది.
Pawan Kalyan
Social Media
Janasena
Bheemla Nayak

More Telugu News