ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై హీరో రామ్ స్పందన!

Actor Ram Pothineni comments on war
  • తీవ్ర రూపం దాల్చిన యుద్ధం
  • ఉక్రెయిన్ నుంచి రావడానికి అవస్థలు పడుతున్న జనం
  • సొంత పౌరులను తీసుకురావడానికి అక్కడ కాలు మోపాలన్న రామ్
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. తొలి రోజుల్లో రష్యాను ఉక్రెయిన్ ఏమాత్రం ప్రతిఘటించలేకపోయిందని అందరూ భావించారు. ఆ తర్వాత రష్యా బలగాలను ఉక్రెయిన్ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కోవడం ప్రారంభమయింది. రష్యా బలగాలపై ఉక్రెయిన్ సైన్యం ఎక్కడికక్కడ ఎదురుదాడులు చేస్తోంది. 

ఈ క్రమంలో యుద్ధం భీకర రూపు దాల్చింది. యుద్ధం వల్ల పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆకాంక్షిస్తున్నారు. అక్కడ చిక్కుకున్న అందరూ సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నారు. 

టాలీవుడ్ హీరో రామ్ కూడా యుద్ధంపై స్పందించాడు. యుద్ధం కోసం తమ సైన్యాన్ని ఇతర దేశాల్లోకి నేరుగా పంపడం సరైన చర్య కాకపోవచ్చు... కానీ, తన పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకురావడానికి అక్కడ కాలు మోపడం వారి కనీస బాధ్యత అని ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
Ram Pothineni
Tollywood
Ukraine
Russia
War

More Telugu News