ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు మరో 3 భారత వాయుసేన విమానాలు
- భారతీయులను తీసుకొచ్చేందుకు భారీ ఆపరేషన్
- ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకున్న భారతీయులు
- హిందోన్ ఎయిర్‌బేస్ నుంచి కాసేపట్లో బయలుదేరనున్న 3 విమానాలు
- పోలండ్, హంగెరీ, రొమేనియాకు చేరుకుంటాయన్న అధికారులు
భారత వాయుసేనకు చెందిన మూడు రవాణా విమానాలు హిందోన్ ఎయిర్‌బేస్ నుంచి పోలండ్, హంగెరీ, రొమేనియాకు కాసేపట్లో బయలుదేరనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరోవైపు, సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు పలు సామగ్రితో బయలుదేరి వెళ్లిందని వివరించారు. అక్కడి భారతీయులకు సాయపడేలా ఆయా విమానాల్లో టెంట్లు, బ్లాంకెట్ల వంటి సామగ్రిని కూడా పంపుతున్నారని చెప్పారు.