Nithin: నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'జూనియర్'

Nithin in Vakkantham Vamsi Movie
  • నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజక వర్గం'
  • దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి 
  • కథానాయికగా కృతి శెట్టి
  • త్వరలో వక్కంతం వంశీతో సెట్స్ పైకి  

వక్కంతం వంశీ చాలా సినిమాలకు కథలను అందించాడు. తాను కూడా దర్శకుడిగా మారిపోయి ఆ మధ్య 'నా పేరు సూర్య' సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నిర్మితమైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో సహజంగానే వంశీకి గ్యాప్ వచ్చేసింది. 

మళ్లీ ఇప్పుడు ఆయన దర్శకుడిగా తన రెండవ సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. నితిన్ హీరోగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఠాగూర్ మధు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. 

ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్లో ఈ  సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో కృతి శెట్టి ఆయన జోడీగా అలరించనుంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, వక్కంతం వంశీ ప్రాజెక్టును నితిన్ పట్టాలెక్కిస్తాడన్న మాట.

  • Loading...

More Telugu News