Volodymyr Zelensky: జెలెన్ స్కీని చంపడానికి ఆఫ్రికా నుంచి 400 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్... సంచలనం రేపుతున్న కథనం

Hired killers to kill Ukraine president Volodymyr Zelensky
  • రష్యా అధ్యక్షుడి కనుసన్నల్లో వాగ్నర్ గ్రూపు
  • పుతిన్ సన్నిహితుడే హెడ్
  • ఉక్రెయిన్ లో 4 వేలమంది కిల్లర్స్
  • కీవ్ దిశగా 400 మంది
  • నెంబర్ వన్ టార్గెట్ తానేనని ఇటీవల జెలెన్ స్కీ వెల్లడి
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మరింత తీవ్రమైన నేపథ్యంలో ఓ మీడియా కథనం సంచలనం సృష్టిస్తోంది. రష్యాకు తాను నెంబర్ వన్ టార్గెట్ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జెలెన్ స్కీని చంపడానికి 400 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ను రష్యా పురమాయించినట్టు ఈ కథనంలో పేర్కొన్నారు. 

వాగ్నర్ గ్రూప్ కు చెందిన వారంతా ప్రత్యేక శిక్షణ పొందినవారని, పుతిన్ ఆదేశాలపై వారిని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చారని వెల్లడించారు. 23 మంది అంతర్జాతీయ నేతలను చంపడమే వారి టార్గెట్ అని, వారికి అందించిన హిట్ లిస్టులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఉన్నాడని ఆ కథనంలో వివరించారు. 

కాగా, గతంలో పుతిన్ రష్యా గూఢచార సంస్థ కేజీబీ ఏజెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్లు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే తన సన్నిహితుడి సాయంతో వాగ్నర్ గ్రూపు ఏర్పాటు చేసి, కీలక ప్రభుత్వ పెద్దలను హతమార్చేందుకు ప్రొఫెషనల్ కిల్లర్స్ ను వినియోగిస్తుంటాడని అందులో పేర్కొన్నారు. 

మొత్తం 4 వేల మందిని ఉక్రెయిన్ కు పంపగా, వారిలో 400 మందిని కేవలం జెలెన్ స్కీని చంపడం కోసం నియమించారట. వేర్పాటు వాద డొనెట్క్స్, లుహాన్స్క్ ప్రాంతాల మీదుగా వారు కీవ్ వెళ్లినట్టు కథనంలో వివరించారు.
Volodymyr Zelensky
Ukraine
Hired Killers
Russia

More Telugu News