Andhra Pradesh: 27న ఏపీ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక‌

  • క‌రీమున్నీసా మృతితో ఉప ఎన్నిక‌
  • 7న నోటిఫికేష‌న్‌, 14న నామినేష‌న్లు
  • క‌రీమున్నీసా కుమారుడికే వైసీపీ టికెట్‌
  • వైసీపీ విజ‌యం లాంఛ‌న‌మే
by election for ap mlc seat on march 24

ఏపీలో మ‌రో ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మైంది. ఏపీ శాస‌న‌మండ‌లికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన క‌రీమున్నీసా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అన‌తి కాలంలోనే మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. మార్చి 24న ఈ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 

అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాలు మొద‌లు కానున్న మార్చి 7న ఈ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానుండ‌గా.. 14 నుంచి నామినేష‌న్లు స్వీక‌రించ‌నున్నారు. మార్చి 15న నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుండ‌గా.. 17 వ‌రకు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు విధించారు. ఆ త‌ర్వాత 24న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అసెంబ్లీలో ఆయా పార్టీల బ‌లాబ‌లాల‌ను చూస్తే.. ఈ స్థానానికి టీడీపీ పోటీ చేసినా వైసీపీనే విజ‌యం వ‌రిస్తుంది. 

అంతేకాకుండా క‌రీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడినే బ‌రిలోకి దింప‌నున్న‌ట్లుగా ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో ఎమ్మెల్సీగా క‌రీమున్నీసా కుమారుడి గెలుపు లాంఛ‌నప్రాయ‌మేన‌న్న అబిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

More Telugu News