Ukraine: ఉక్రెయిన్ లో చిక్కుకున్న కుమారుడు.. టెన్షన్ తట్టుకోలేక తల్లి మృతి!

Mother died with tension about her son studying in Ukraine
  • ఉక్రెయిన్ లో చదువుకుంటున్న శక్తివేల్
  • యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కొడుకు గురించి తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన తల్లి
  • వీడియో కాల్ ద్వారా తల్లి మృతదేహాన్ని చూసి భోరున విలపించిన శక్తివేల్

యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొంది. భారతీయులు పెద్ద సంఖ్యలో అక్కడ చిక్కుకున్నారు. మరోవైపు తన కొడుకు సురక్షితంగా తిరిగొస్తాడో, లేదో అనే ఒత్తిడిని తట్టుకోలేక ఓ కన్నతల్లి ప్రాణం విడిచింది. 

వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన శక్తివేల్ ఉక్రెయిన్ లో చదువుకుంటున్నాడు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుంచి ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. కొడుకు రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసింది. 

ఈ క్రమంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. వీడియో కాల్ ద్వారా తన తల్లి మృతదేహాన్ని చూసిన కుమారుడు భోరున విలపించాడు.

  • Loading...

More Telugu News