Team India: మూడో టీ20లోనూ టీమిండియానే విజేత... సిరీస్ క్లీన్ స్వీప్

Team India clean sweeps series against Sri Lanka
  • ధర్మశాలలో టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు
  • 16.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన భారత్
  • శ్రేయాస్ అయ్యర్ 73 నాటౌట్
టీమిండియా వరుసగా మరో టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల వెస్టిండీస్ పై వన్డే, టీ20 సిరీస్ ల్లో నెగ్గిన భారత్... తాజాగా శ్రీలంకపైనా అదే ప్రదర్శన కనబర్చింది. ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 147 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

సూపర్ ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ మరోసారి అర్ధసెంచరీతో అలరించాడు. అయ్యర్ 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయ్యర్ స్కోరులో 9 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. రవీంద్ర జడేజా 15 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్ సంజు శాంసన్ 18, దీపక్ హుడా 21 పరుగులు చేశారు. వెంకటేశ్ అయ్యర్ (5) విఫలమయ్యాడు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 2, చమీర 1, కరుణరత్నే 1 వికెట్ తీశారు. ఈ విజయంతో టీ20 సిరీస్ ను భారత్ 3-0తో చుట్టేసింది.

ఇక ఇరుజట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ మార్చి 4న ప్రారంభం కానుంది.
Team India
T20 Series
Clean Sweep
Sri Lanka

More Telugu News