త్రివిక్రమ్ గారి ఆ మాటే నాకు గుర్తుంది: 'భీమ్లా నాయక్' డైరెక్టర్

Bheemala Nayak movie update
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నిన్న థియేటర్లకు వచ్చిన 'భీమ్లా నాయక్' తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఈ సందర్భంగా మాట్లాడాడు. 

"సితార బ్యానర్ వారు .. పవన్ గారు .. రానా గారు .. తమన్ గారు వీరందరినీ హారంలో దారంలా కలుపుతూ మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. ఆయన నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆయన ఈ సినిమాకి అందించిన సహాయ సహకారాలను గురించి చెప్పడానికి మాటలు చాలవు.

'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా రీమేక్ గా 'భీమ్లా నాయక్'లో మార్పులు చేయాలనుకుని కూర్చున్నాము. "ఏ స్థాయిలో మనం ఈ సినిమాలో మార్పులు చేయాలంటే, ఈ సినిమా రీమేక్ అనే విషయం మరిచిపోయి .. వేరే భాషల వాళ్లు దీని రీమేక్ రైట్స్ కోసం అడగాలి" అని త్రివిక్రమ్ గారు అన్నారు. ఆ మాటలు గుర్తుపెట్టుకునే నేను ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Pavan kalyan
Rana Daggubati
Sagar Chandra
Bheemla Nayak Movie

More Telugu News