Heavenly Jin: ఈ రెస్టారెంటు ఆకాశాన్నంటుతుంది... ఎక్కడో చూడండి!

Heavenly Jin Restaurant made it to enter Guinnes Book of World Records
  • షాంఘైలో హెవెన్లీ జిన్ రెస్టారెంటు ఘనత
  • ఎత్తు 555.36 మీటర్లు
  • గిన్నిస్ బుక్ లో స్థానం
  • షాంఘై టవర్స్ 120వ అంతస్తులో రెస్టారెంట్
చైనా ప్రధాన నగరాల్లో ఒకటైన షాంఘైలో ఓ రెస్టారెంటు ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఆ రెస్టారెంటు ప్రత్యేకత దాని ఎత్తే. ఆ రెస్టారెంటును తలెత్తి చూడాలంటే ఎంతో ప్రయాసకు గురికావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రెస్టారెంటు భూమి నుంచి అరకిలోమీటరు ఎత్తులో ఉంటుంది. 555.36 మీటర్ల ఎత్తులో ఉండే ఆ రెస్టారెంటును ప్రఖ్యాత షాంఘై టవర్స్ లో 120వ అంతస్తులో ఏర్పాటు చేశారు. 

ఇది జే హోటల్ కు చెందినది. దీన్ని హెవెన్లీ జిన్ రెస్టారెంట్ గా పిలుస్తారు. ఈ రెస్టారెంటులో కూర్చుంటే మేఘాల్లో తేలుతున్నట్టే ఉంటుంది. ఇందులో ఓపెన్ కిచెన్ ఉంటుంది. హోటల్ కు వచ్చే అతిథులు ఎవరైనా కిచెన్ లోకి ప్రవేశించి అక్కడ వంటకాలు తయారుచేసే తీరును స్వయంగా పరిశీలించవచ్చు. ఒక్కసారే 256 మంది దీంట్లో విందు ఆరగించవచ్చు. ఐదు ప్రైవేటు డైనింగ్ రూములు కూడా ఉన్నాయి. 

కాగా, హెవెన్లీ జిన్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కే క్రమంలో దుబాయ్ కి చెందిన అట్మోస్ఫియర్ రెస్టారెంటును వెనక్కి నెట్టింది. అట్మోస్ఫియర్ రెస్టారెంటు 441.3 మీటర్ల ఎత్తులో కొలువై ఉంటుంది. చైనాలో ప్రభుత్వ ప్రమేయం అత్యధిక స్థాయిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. చైనా ప్రభుత్వ అధీనంలోనిదే జే హోటల్ గ్రూప్. అందులో ఓ హోటల్ ను షాంఘై టవర్స్ లో ఏర్పాటు చేశారు. షాంఘై టవర్స్ 632 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్స్ లో మూడో స్థానంలో ఉంది.
Heavenly Jin
Highest Restaurant
Guinnes Book
Shanghai
China

More Telugu News