Andhra Pradesh: ఆల‌స్యంగా వ‌స్తే లీవ్‌లో ఉన్న‌ట్లే.. ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కారు షాక్‌

new guidelines for AP employees on timely governance
షార్ట్స్‌లో చూడండి
ఇప్ప‌టికే పీఆర్సీ విష‌యంలో ఏపీలోని వైసీపీ స‌ర్కారు వ్య‌వ‌హరించిన తీరుతో ఉద్యోగులు తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఏదోలా ఆ స‌మ‌స్య తీరిపోయింద‌ని ఉద్యోగులు భావిస్తున్న‌ త‌రుణంలో వైసీపీ స‌ర్కారు ఉద్యోగుల‌కు మ‌రో షాకిచ్చింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ‌య‌పాల‌న పాటించాల్సిందేన‌ని, ఇక‌పై ఆల‌స్యంగా విధుల‌కు వ‌స్తే.. ఆ రోజున లీవ్ పెట్టిన‌ట్టుగానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం శనివారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ఈ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌స్తే.. ఉదయం 10 గంట‌ల‌కు కార్యాల‌యాల‌కు రావాల్సిన ఉద్యోగులు ఓ 10 నిమిషాల వ‌ర‌కు ఆల‌స్య‌మైతే ఫ‌ర‌వా లేదు గానీ.. అంత‌కు ఒక్క నిమిషం లేటైనా సెల‌వు ప‌డిపోతుంది. అంతేకాకుండా 10.10 గంట‌ల నుంచి 11 గంట‌ల మ‌ధ్య‌లో కార్యాల‌యానికి వ‌చ్చేందుకు నెల‌కు మూడు ప‌ర్యాయాలు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ట‌. ఆ ప‌రిమితి దాటేస్తే.. ఇక వేత‌నంలో కోత మొద‌లైపోతుంద‌ట‌. ఈ మేర‌కు ఏపీ ఆర్ధిక శాఖ విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల‌పై ఇప్పుడు ఏపీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.
Go Back to Shorts
Andhra Pradesh
ap employees
AP Secretariat

More Telugu News