Raviteja: 'ధమాకా' కోసం యాక్షన్ లోకి దిగిపోయిన రవితేజ!

  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ'
  • ఆ తరువాత సినిమాగా రూపొందుతున్న 'ధమాకా'
  • హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ 
  • రవితేజ సరసన నాయికగా శ్రీలీల
Dhamaka movie update

రవితేజ కథానాయకుడిగా ఇటీవలే 'ఖిలాడి' సినిమా థియేటర్లకు వచ్చింది .. రవితేజ మార్క్ సినిమా అనిపించుకుంది. ఆ తరువాత సినిమాగా ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ'ని లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన క్లారిటీ త్వరలో రానుంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'ధమాకా' షూటింగును కూడా చకచకా కానిచ్చేస్తున్నాడు. 

'ధమాకా' షూటింగు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. 'డబుల్ ఇంపాక్ట్' అనేది ట్యాగ్ లైన్. తాజా షెడ్యూల్ ను నిన్ననే మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్లో రవితేజ తదితరులపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వదిలారు. 

ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ .. "ఒక భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. బడ్జెట్ పరంగా ఏ విషయంలోనూ రాజీ పడకుండా ముందుకు వెళుతున్నాం. రవితేజ అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికగా శ్రీలీల కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News