ఉక్రెయిన్ ను ఆక్రమించేస్తున్న రష్యా.. రెండు గంటల్లోనే రాజధాని కీవ్ లో రష్యా మకాం!
- గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ను ఆక్రమిస్తున్న రష్యా
- 10 నిమిషాలకు ఒక నగరం చొప్పున ఆక్రమణ
- ఏ మాత్రం ప్రతిఘటించని ఉక్రెయిన్
మరోవైపు ఉక్రెయిన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కావడం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తరహాలో రష్యా విరుచుకుపడుతోంది. ప్రతి 10 నిమిషాలకు ఒక్కో నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుందంటే రష్యా దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్కా ప్రణాళికతో ఉక్రెయిన్ కు ప్రతిఘటించే అవకాశాన్ని కూడా ఇవ్వని విధంగా రష్యా దాడి చేస్తోంది.