Ukraine: బ్రేకింగ్ న్యూస్‌.. ఉక్రెయిన్‌లో ఎమ‌ర్జెన్సీ!

The Ukraine government declared the state of emergency in the country
  • నెల రోజుల పాటు ఎమ‌ర్జెన్సీ
  • కీల‌క ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ అమ‌లు
  • ర‌ష్యాకు దీటుగా ఉక్రెయిన్ ప్ర‌క‌ట‌న‌

ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య యుద్ధం త‌ప్ప‌దా? అన్న భ‌యాందోళ‌న‌లు మ‌రింత మేర పెరిగాయ‌నే చెప్పాలి. ర‌ష్యా త‌న సైనిక ప‌టాలాన్ని ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌కు త‌ర‌లిస్తుండ‌గా.. తాము కూడా ఏమాత్రం త‌గ్గేది లేద‌న్న‌ట్లుగా ఉక్రెయిన్ స‌మ‌ర స‌న్నాహాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా దేశంలో ఎమ‌ర్జెనీని విధిస్తూ ఉక్రెయిన్ ప్ర‌భుత్వం కాసేప‌టి క్రితం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

ఉక్రెయిన్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు.. దేశంలో నెల రోజుల పాటు ఎమ‌ర్జెన్సీ అమ‌ల్లో ఉంటుంది. దేశంలోని ప‌లు కీల‌క ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. ఈ త‌ర‌హా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే.. ఉక్రెయ‌న్ కూడా యుద్ధ స‌న్నాహాల్లో నిమ‌గ్న‌మైంద‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

  • Loading...

More Telugu News