రేపు అనుచరులతో జగ్గారెడ్డి కీలక భేటీ
- టీపీసీసీ చీఫ్ రేవంత్ వైఖరిపై విమర్శలు
- సరిదిద్దకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటన
- అందుకు గడువు కూడా విధించిన జగ్గారెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్న రీతిలో సాగుతున్న జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డి వచ్చాక అసలు పార్టీకి చెందిన సీనియర్ నేతలనే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కనీసం ఆయా ప్రాంతాల్లో పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఆయా ప్రాంతాల నేతలకు ఆహ్వానం ఉండటం లేదని కూడా జగ్గారెడ్డి బాహాటంగానే విమర్శలు చేశారు.
ఈ తరహా పరిస్థితి మారకపోతే పార్టీకి తాను రాజీనామా చేస్తానంటూ ఇదివరకే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. అందుకు గడువును కూడా ప్రకటించారు. ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రేపు తన అనుచరులు, మద్దతుదారులతో ఆయన భేటీ కానున్నారు.