ఏపీలో కరెంటు కోతలని రాస్తే పరువునష్టం దావా తప్పదు: ఇంధనశాఖ కార్యదర్శి హెచ్చరిక
- నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నాం
- వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం
- ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాం
- ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్య
ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, ఈ విషయాన్ని పలుమార్లు విలేకరుల సమావేశంలో చెప్పినప్పటికీ పదేపదే అలాంటి వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రజల్లో అపోహలు కలిగించడంతోపాటు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏపీలో విద్యుత్ కోతలంటూ మరోమారు వార్తలు కనిపిస్తే పరువునష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని శ్రీకాంత్ హెచ్చరించారు.