Amitabh Bachchan: ప్రభాస్... నువ్వు పంపిన వంటకాలతో సైన్యానికి భోజనం పెట్టొచ్చు: అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan opines on Prabhas home cooked food
  • ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె
  • కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్
  • రామోజీ ఫిలింసిటీలో షూటింగ్
  • అమితాబ్ కు ప్రభాస్ ఇంటి నుంచి విందు భోజనం
  • ఆ రుచులకు ఉబ్బితబ్బిబ్బయిన బిగ్ బీ 
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండడం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. షూటింగ్ కోసం భాగ్యనగరానికి విచ్చేసిన అమితాబ్ కు ప్రభాస్ పసందైన ఇంటి భోజనంతో విందు ఏర్పాటు చేశాడు.

 ప్రభాస్ ఇంటి రుచులకు ఫిదా అయిన అమితాబ్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రభాస్ నివాసం నుంచి భారీ సంఖ్యలో వంటకాలు రావడం పట్ల ఆయన అచ్చెరువొందారు.

"బాహుబలి ప్రభాస్... నీ ఆతిథ్యానికి, ఆప్యాయతకు కొలమానం లేదు. నువ్వు తీసుకొచ్చిన ఇంటి భోజనం రుచి వర్ణించనలవికావడంలేదు. అసలు, నువ్వు తెచ్చిన భోజనం పరిమాణం ఎంతుందో తెలుసా... దాంతో సైన్యానికి భోజనం పెట్టొచ్చు! ఇక, స్పెషల్ కుకీస్ (బిస్కెట్లు) సంగతి కొస్తే కమ్మదనాన్ని మించి ఉన్నాయి. నీ మంచి మాటలతోనే కడుపు నిండిపోతోంది" అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.
Amitabh Bachchan
Prabhas
Home Cooked Food
Project K
Tollywood
Bollywood

More Telugu News