Venkatesh Iyers: హార్ధిక్ పాండ్యా కంటే వెంకటేశ్ అయ్యర్ కే అవకాశాలు ఎక్కువ: వసీం జాఫర్

Wasim Jaffer Makes Huge Statement On Venkatesh Iyers 2022 T20 World Cup Chances
  • టీ20 ప్రపంచకప్ లో అవకాశాలపై విశ్లేషణ
  • ఆరో స్థానంలో చక్కని బ్యాటింగ్
  • బౌలింగ్ తోనూ రాణించడం ప్లస్ అవుతుంది  
యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కు టీ20 ప్రపంచ కప్ లో చోటుకు ఎక్కువ అవకాశాలున్నట్టు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆరో స్థానంలో వచ్చి మ్యాచ్ ను గొప్పగా ముగించడం అతడికి కలిసొస్తుందన్నాడు. బ్యాట్, బౌలింగ్ తో రాణించే ఆల్ రౌండర్ నైపుణ్యాలు అయ్యర్ కు ఉండడంతో, హార్థిక్ పాండ్యాతో పోలిస్తే ఎక్కువ అవకాశం అతడికే ఉంటుందన్న విశ్లేషణ వ్యక్తం చేశాడు.

‘‘ఆరో బ్యాటర్ గా అతడి చక్కని ఆటతీరు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అతడ్ని మనం ఓపెనర్ గానూ చూశాము. దాన్నుంచి బయటకు వచ్చి ఆరో స్థానంలో కుదురుకోవడం, ఆటను ముగించడం నిజంగా అద్భుతం. పైగా అతడి బౌలింగ్ విధానం, కీలకమైన వికెట్లను తీసుకోవడం నిజంగా ప్రపంచకప్ జట్టులో స్థానానికి మొగ్గు లభిస్తుంది.

హార్థిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడో, లేదో తెలియదు. అతడు ఫిట్ నెస్ ఏ మేరకు ఉందన్నది తెలియదు’’ అని జాఫర్ చెప్పాడు. వెస్టిండీస్ తో చివరి టీ20 మ్యాచ్ లో అయ్యర్ బ్యాట్, బౌలింగ్ తో రాణించడమే కాకుండా, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Venkatesh Iyers
T20 World Cup
Wasim Jaffer

More Telugu News