Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ వేడుక తేదీ ఖరారు

BheemlaNayak PreRelease event will be held tomorrow at Yousufguda Police Grounds
  • నిన్న‌నే జ‌ర‌గాల్సిన వేడుక‌
  • మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో వాయిదా
  • రేపు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌ట‌న
  • హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో వేడుక‌
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన నేప‌థ్యంలో ఆయ‌న మృతికి సంతాపంగా నిన్న జరగాల్సిన 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ వేడుక‌ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ తాజాగా ప్రీ రిలీజ్ వేడు‌క‌కు సంబంధించిన కొత్త తేదీని ప్ర‌క‌టించింది.

                         
రేపు సాయంత్రం 6.30 గంట‌ల నుంచి హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ మూవీ ట్రైలర్‌‌‌ను నిన్న రాత్రి విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇక రేపు జరగనున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్‌ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan
bheemla naik
Hyderabad
Tollywood

More Telugu News