Telangana: పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు

  • ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు
  • ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ను పెంచిన ఇంటర్ బోర్డు
  • మూడు సెక్షన్లలో కూడా ఛాయిస్ ప్రశ్నలు
Telangana Inter Board increases choice questions in exams

ఏప్రిల్ 20 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి మే 2వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు... ఏప్రిల్ 21 నుంచి మే 5వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు.  

మరోవైపు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ను రెట్టింపు చేసింది. గతంలో మూడు సెక్షన్లలో రెండు సెక్షన్లకు 50 శాతం ఛాయిస్ ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు మూడు సెక్షన్లలో కూడా ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేదు. కరోనా నేపథ్యంలో అందరినీ పాస్ చేశారు.

ఇటీవల ఇంటర్ ఫస్టియర్ కు పరీక్షలు నిర్వహించగా 50 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో, మళ్లీ ఆ పరీక్షలను రద్దు చేసి అందరూ పాస్ అయినట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే, విద్యార్థులకు కొంత సులువుగా ఉండేందుకు ఛాయిస్ ప్రశ్నలను పెంచుతున్నారు.

More Telugu News