Balakrishna: ఈ సారి కూడా బాలకృష్ణ టైటిల్లో సింహా ఉంటుందట!

Gopichand Malineni movie update
  • గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
  • రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
  • రీసెంట్ గా మొదలైన షూటింగ్  
  • పరిశీలనలో 'వీరసింహా రెడ్డి' టైటిల్

మొదటి నుంచి కూడా బాలకృష్ణ మాస్ ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు. యాక్షన్ .. రొమాన్స్ ఆయన సినిమాల్లో ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. ఇక ఆయన సినిమాల్లో డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అలాంటి డైలాగ్స్ ఉండాలనే ఆయన అభిమానులు కోరుకుంటూ ఉంటారు.

ఇక ఆయన టైటిల్స్ కూడా పవర్ఫుల్ గా ఉండాలని వాళ్లంతా ఆశిస్తారు. అందువల్లనే ఆ విషయంలో దర్శక నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. ఎక్కువగా ఆయన టైటిల్స్ లో 'సింహా' అనేది కనిపిస్తూ ఉంటుంది. 'సమరసింహా రెడ్డి' .. 'నరసింహా నాయుడు' .. 'సింహా' ..'జై సింహా' ఇలా ఆయన టైటిల్స్ లో ఒక సెంటిమెంట్ కనిపిస్తూ ఉంటుంది.

గోపీచంద్ మలినేని సినిమా విషయంలో కూడా ఆయన ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి 'వీరసింహారెడ్డి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.  శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది.

  • Loading...

More Telugu News