Mekapati Goutham Reddy: ఆర్మీ హెలికాప్టర్ లో నెల్లూరుకు మంత్రి మేకపాటి భౌతికకాయం

Mekapati mortal remains will be taken to Nellore in army chopper
  • రేపు ఉదయం 8 గంటలకు తరలింపు
  • ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడి
  • బ్రాహ్మణపల్లిలో ఎల్లుండి అంత్యక్రియలు
  • రేపటి జగనన్న తోడు వాయిదా

గుండెపోటుతో మరణించిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. సైనిక హెలికాప్టర్ లో నెల్లూరు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, హెలికాప్టర్ లో వీలుకాకపోతే ప్రైవేటు విమానంలో అయినా తరలిస్తామని తెలిపారు.

రేపు ఉదయం 8 గంటలకు గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలింపు ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. ఎల్లుండి బుధవారం మేకపాటి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.

కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాలమృతికి సంతాపసూచకంగా ఏపీ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసింది. మంగళవారం ఏర్పాటు చేసిన 'జగనన్న తోడు' ఆర్థికసాయం అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జగనన్న తోడు మూడో విడత సాయాన్ని ఈ నెల 28న ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News