Ram: బోయపాటి మూవీలో రామ్ సరసన బాలీవుడ్ భామ!

parineeti Chopra in Boyapati movie
  • పరిణీతి చోప్రాకు మంచి క్రేజ్
  • యూత్ లో మంచి ఫాలోయింగ్
  • రామ్ మూవీతో పరిచయం
  • ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్న బోయపాటి

బాలీవుడ్ భామలు తెలుగు తెర వైపు రావడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఇక్కడ బాలీవుడ్ ముద్దుగుమ్మల సందడి ఎక్కువగా కనిపించేది. ఆ తరువాత వాళ్ల హవా కాస్త తగ్గి మధ్యలో తమిళ .. మలయాళ బ్యూటీల జోరు ఎక్కువైంది. మళ్లీ ఇప్పుడు పాన్ ఇండియా అనే మాట తెరపైకి వచ్చిన తరువాత బాలీవుడ్ భామలను ఎక్కువగా రంగంలోకి దింపుతున్నారు.

అలా శ్రద్ధా కపూర్ .. కియారా అద్వాని తెలుగు తెరకి పరిచయం కాగా, 'ఆర్ ఆర్ ఆర్'తో అలియా భట్ ఎంట్రీ ఇస్తోంది. ఇక తాజాగా రామ్ సినిమా విషయంలో పరిణీతి చోప్రా పేరు వినిపిస్తోంది. రామ్ హీరోగా శ్రీనివాస్ చిట్టూరి ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళుతున్నారు.  

ఈ సినిమా కోసం ఆయన పరిణీతి చోప్రాను తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గ్లామర్ పరంగా .. నటన పరంగా పరిణీతి చోప్రాకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన అనుభవం ఉంది. దాదాపు ఆమె ఎంపిక ఖరారైపోయిందనే చెబుతున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News