Rajinikanth: నిర్మాత కుమార్తె పెళ్లికి హాజరైన రజనీకాంత్, కమల్ హాసన్

Rajinikanth and Kamal Haasan attends producer Anbuchezhian daughter wedding
  • చెన్నైలో నిర్మాత అన్బుచెళియన్ కుమార్తె వివాహం
  • సుస్మిత వెడ్స్ శరణ్
  • వధూవరులను ఆశీర్వదించిన రజనీకాంత్, కమల్ 
  • పెళ్లికి హాజరైన కోలీవుడ్ ప్రముఖులు
కోలీవుడ్ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ కుమార్తె సుస్మిత వివాహం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజేంద్రన్ కుమారుడు శరణ్ తో ఘనంగా జరిగింది. చెన్నైలోని తిరువన్మయూరులోని శ్రీరామచంద్ర కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు తమిళ సినీ పరిశ్రమ తరలివచ్చింది. తలైవా రజనీకాంత్, అగ్రనటుడు కమల్ హాసన్ ఈ పెళ్లిలో సందడి చేశారు. వేర్వేరుగా పెళ్లికి వచ్చిన వీరిద్దరూ వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వివాహ వేడుకకు వచ్చిన వారిలో సీనియర్ నటుడు ప్రభు, విక్రమ్ ప్రభు, విజయ్ ఆంటోనీ, నాజర్, మనోబాల, వైభవ్, దర్శకులు లింగుసామి, వెంకట్ ప్రభు, ఎల్రెడ్ కుమార్, సుసి గణేశన్, నిర్మాతలు బోనీ కపూర్, కలైపులి ఎస్ థాను తదితరులు ఉన్నారు.
Rajinikanth
Kamal Haasan
Anbuchezhian
Daughter
Wedding
Kollywood

More Telugu News