Samantha: 'శాకుంతలం' నుంచి ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్!

Shakunthalam first look released
  • గుణశేఖర్ దృశ్య కావ్యంగా 'శాకుంతలం'
  • టైటిల్ రోల్ పోషించిన సమంత
  • దుష్యంతుడిగా దేవ్ మోహన్
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
సమంత ప్రధాన పాత్రధారిగా 'శాకుంతలం' సినిమా రూపొందింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గుణశేఖర్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని చాలాకాలమే అయింది. అప్పటి నుంచి కూడా గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమా నుంచి ఇంతవరకూ గుణశేఖర్ ఎలాంటి అప్ డేట్స్ వదల్లేదు. ఈ సినిమాకి సంబంధించిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో పూర్తి దృష్టి ఆయన ఆ వైపునే పెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. శకుంతల పాత్రలో సమంత లుక్ చాలా అందంగా .. ఒక పెయింటింగులా ఉంది.

సెలయేరు ఒడ్డున కూర్చున్న శకుంతల ..  ఆమె చుట్టూ హంసలు .. నెమళ్లు .. లేళ్లు .. కుందేళ్లు గుమిగూడటం కనిపిస్తోంది. శకుంతల జీవితం ప్రకృతితో ముడిపడి కనిపిస్తుంది. అందుకు అద్దంపడుతూ ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.
Samantha
Dev Mohan
Gunasekhar
Shakunthalam Movie

More Telugu News