Balakrishna: తాజా చిత్రం నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను పంచుకున్న గోపీచంద్ మలినేని

Gopichand Malineni shares Balakrishna first look
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య
  • బాలకృష్ణకిది 107వ చిత్రం
  • ఇటీవలే పూజా కార్యక్రమాలు
  • బాలయ్య సరసన శ్రుతిహాసన్

టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ 107వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న గోపీచంద్ మలినేని ఆనందంతో పొంగిపోతున్నాడు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రం నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశాడు.

పంచకట్టు, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, పక్కనే లాండ్ రోవర్ డిఫెండర్ వాహనం... సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో బాలయ్య అదరగొడుతున్నాడు. ఫ్యాన్స్ కు కిక్ రావడం ఖాయం అనిపించేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది.

సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలకపాత్ర పోషిస్తోంది.

  • Loading...

More Telugu News