Shiv Sena: తెలంగాణ సీఎం కేసీఆర్ కు తగిన సామర్థ్యాలు ఉన్నాయి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Telangana CM KCR has ability to lead taking all together
  • అందరినీ కలుపుకుని పోగలరు
  • రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు
  • ఆయనకు నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందరిని కలుపుకుని, ముందుకు నడిపించే సామర్థ్యాలు ఉన్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో సమావేశమై బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలపై సమాలోచనలు చేయడం తెలిసిందే. దీనిపై సంజయ్ రౌత్ సోమవారం నాగపూర్ లో స్పందించారు. సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

‘‘కే చంద్రశేఖర్ రావు ఎంతో కష్టపడి పనిచేసే రాజకీయ నేత. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అందరికనీ కలుపుకునిపోయే, నాయకత్వం వహించే సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి’’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఇద్దరు సీఎంలు (కేసీఆర్,ఠాక్రే), ఇతర రాజకీయ నాయకులు త్వరలోనే సమావేశమై చర్చలు నిర్వహిస్తారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి పాలు కాబోతోందని ఈ సందర్భంగా రౌత్ అన్నారు.
Shiv Sena
Sanjay Raut
Telangana
kcr

More Telugu News