Pawan Kalyan: 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ వాయిదా.. మంత్రి మేకపాటి హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపం

pawan expresses condolences
  • ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూత‌
  • ఈ నేప‌థ్యంలో ప్రీరిలీజ్ వాయిదా వేస్తున్నామ‌న్న సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
  • ట్రైల‌ర్ రిలీజ్ పైనా అనుమానాలు
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్ర‌క‌టించింది. దీంతో గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ వేడుక‌ వాయిదా ప‌డింది. ప్రీరిలీజ్ వేడుక‌ వాయిదా వేసినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్ర‌క‌ట‌న చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తోన్న ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ మూవీ ట్రైలర్‌‌‌ను ఈ రోజు రాత్రి 8.10 గంటలకి రిలీజ్ చేయనున్నామ‌ని ఇప్ప‌టికే సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే, మేక‌పాటి మృతి నేప‌థ్యంలో ట్రైల‌ర్ విడుద‌ల అవుతుందా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు.  

కాగా, మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గౌతమ్‌రెడ్డి కన్నుమూశారనే విషయం నమ్మశక్యం కాలేదని అన్నారు. ఆయ‌న‌ మంచి సేవలు అందించాలని రాజకీయాల్లోకి వచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.
Pawan Kalyan
Bheemla naik
Tollywood
Mekapati Goutham Reddy

More Telugu News