Mekapati Goutham Reddy: గౌతమ్‌రెడ్డి మరణంపై అపోలో వైద్యుల ప్రకటన విడుదల!

Apolo Hospitals statement on Mekapati Goutham Reddy death
  • ఇంటి వద్ద గౌతమ్‌రెడ్డి కుప్పకూలారు
  • ఉదయం 7.45కి ఆసుపత్రికి తీసుకొచ్చారు
  • ఉదయం 9.16 గంటలకు తుది శ్వాస విడిచారు  
ఏపీ యువ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వైద్యులు ప్రకటన చేశారు. ఇంటి వద్ద గౌతమ్‌రెడ్డి కుప్పకూలారని... ఉదయం 7.45 గంటలకు అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారని ప్రకటనలో తెలిపారు.

స్పందించని స్థితిలో ఆయనను హాస్పిటల్ కు తీసుకొచ్చారని... ఆసుపత్రికి వచ్చే సమయానికే శ్వాస ఆడటం లేదని చెప్పారు. ఐసీయూలో వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు. ఉదయం 9.16 గంటలకు ఆయన కన్నుమూశారని వెల్లడించారు.
Mekapati Goutham Reddy
YSRCP
Apolo Hospitals

More Telugu News