Mekapati Goutham Reddy: ప్ర‌తిరోజు వ్యాయామం చేసేవారు.. కుప్ప‌కూలడంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లాం: మంత్రి మేక‌పాటి అనుచ‌రులు

watchman on mekapati death
  • ఆయ‌న‌కు ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లూ లేవు
  • గుండె పోటు వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు
  • ఉద‌యం నివాసంలోనే ఆయ‌న‌కు చాతిలో నొప్పి
  • ద‌గ్గ‌రున్న వారిని పిలుస్తూ సోఫాలోనే ప‌డిపోయారు
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ కుటుంబస‌భ్యులు ఆయన‌ను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించగా అప్ప‌టికే మృతి చెందార‌ని అపోలో వైద్యులు అంటున్నారు. దీనిపై హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని మేక‌పాటి గౌతమ్‌రెడ్డి అనుచ‌రులు, అటెండ‌ర్‌, వాచ్‌మ‌న్ స్పందించారు. గౌతమ్‌రెడ్డి ప్ర‌తిరోజు వ్యాయామం చేసేవారని చెప్పారు. ఆయ‌న‌కు ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లూ లేవ‌ని, గుండెపోటు వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని అన్నారు.

ఈ రోజు ఉదయం జిమ్‌కు వెళ్లాల‌ని గౌతమ్‌రెడ్డి అనుకున్నార‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో నివాసంలోనే ఆయ‌న‌కు చాతిలో నొప్పి వ‌చ్చింద‌ని అన్నారు. దీంతో ద‌గ్గ‌రున్న వారిని పిలుస్తూ సోఫాలోనే కుప్ప‌కూలార‌ని తెలిపారు. ఆయ‌న‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌స్తోన్న స‌మ‌యంలోనే స్పృహ కోల్పోయార‌ని అన్నారు. ఆయ‌న‌ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని, ఆ త‌ర్వాత‌ ఆసుప‌త్రి వైద్యులు ఆయ‌న మృతి చెందిన‌ట్లు ప్ర‌క‌టించార‌ని వివ‌రించారు.
Mekapati Goutham Reddy
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News