Vangaveeti Ranga: విజయవాడలో వంగవీటి రంగా విగ్రహం వద్ద భారీ పోలీసు బందోబస్తు

Police force at Vangaveeti Ranga statue in Vijayawada
  • విజయవాడ కేంద్రంగా జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్లు
  • రంగా విగ్రహానికి నివాళి అర్పించే కార్యక్రమానికి పిలుపునిచ్చిన కాపు సంఘాలు
  • కొవిడ్ నేపథ్యంలో అనుమతిని ఇవ్వలేమన్న పోలీసులు
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. రంగా విగ్రహానికి నివాళి అర్పించే కార్యక్రమానికి కాపు సంఘాలు పిలుపునిచ్చాయి.

నివాళి అర్పించిన అనంతరం... జిల్లాకు రంగా పేరు పెట్టాలనే డిమాండ్ తో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ కు ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే కొవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అనుమతిని ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. పరిమిత సంఖ్యలో వస్తేనే అనుమతిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రంగా విగ్రహం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Vangaveeti Ranga
Vijayawada
Statue

More Telugu News