Rohit Sharma: రోహిత్ శర్మ నెంబర్ 1.. అతడి నాయకత్వంలో కొత్త కెప్టెన్ల తయారీ: చేతన్ శర్మ

 Rohit Sharma Number 1 Cricketer Says Team India Chief Selector Chetan Sharma
  • అతడి ఎంపిక స్పష్టమైనదే
  • ఫిట్ గా ఉన్నంత కాలం అతడే కెప్టెన్
  • ఎంతకాలం అన్నది చెప్పలేం
రోహిత్ శర్మను దేశంలోనే నెంబర్ 1 క్రికెటర్ గా టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అయిన చేతన్ శర్మ పేర్కొన్నారు. ఇప్పటికే టీ20, వన్డే జట్లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తుండగా, టెస్ట్ జట్టుకు సైతం అతడినే బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా చేతన్ శర్మ మాట్లాడారు.
 
‘‘రోహిత్ శర్మ దేశంలో నెంబర్ 1 క్రికెటర్. మూడు ఫార్మాట్లలోనూ ఆడగలడు. అతడ్ని ఫిట్ గా ఉంచడం ఎలా అన్నదే మాకు ముఖ్యమైనది. క్రికెటర్లు తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటారు. రోహిత్ తో ఎప్పటికప్పుడు మేము దీని గురించి మాట్లాడుతుంటాం. రోహిత్ ఇప్పటికైతే ఫిట్ గానే ఉన్నాడు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయన్నది ఊహించడం కష్టం’’ అని చేతన్ శర్మ తెలిపారు. రోహిత్ ను టెస్ట్ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేయడం అన్నది తమ స్పష్టమైన ఎంపికగా పేర్కొన్నారు. రోహిత్ నాయకత్వంలో భవిష్యత్తు కెప్టెన్లను తీర్చిదిద్దుతామని చేతన్ చెప్పారు.
 
‘‘రోహిత్ దీర్ఘకాలం పాటు నాయకత్వం వహించగలిగితే అది నిజంగా మనకు మంచిదే. రోహిత్ ఫిట్ గా, అందుబాటులో ఉన్నంత వరకు టెస్ట్ కెప్టెన్ గా అతడే కొనసాగుతాడు. విశ్రాంతి కోరుకుంటే అతడికి విరామం ఇస్తాం’’అని చేతన్ శర్మ వివరించారు.
Rohit Sharma
Team Indi
captain
Chetan Sharma

More Telugu News