Hyderabad: ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో సినీ ప్ర‌ముఖుల కీల‌క భేటీ

tollywood 24 crafts meet
  • సినీ ఇండస్ట్రీకి చెందిన 24 క్లాఫ్ట్స్‌ సభ్యులు హాజ‌రు
  • మొత్తం 240 మంది సభ్యులకు ఆహ్వానం
  • సి.క‌ల్యాణ్‌, ప్ర‌స‌న్న కుమార్, త‌మ్మారెడ్డి, రాజ‌మౌళి హాజ‌రు
సినీ పరిశ్రమ సమస్యలపై చ‌ర్చించేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో.. సినీ ఇండస్ట్రీకి చెందిన 24 క్లాఫ్ట్స్‌ సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ స‌మావేశానికి మొత్తం 240 మంది సభ్యులకు ఆహ్వానం అందిన‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌కు వ‌చ్చిన వారిలో నిర్మాత‌లు సి.క‌ల్యాణ్‌, ప్ర‌స‌న్న కుమార్, త‌మ్మారెడ్డి, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌దిత‌రులు ఉన్నారు. సినీ కార్మికుల సంక్షేమంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధరలపెంపు అంశంపై ప్రభుత్వం నుంచి ముందడుగు పడిన నేప‌థ్యంలో దీనిపై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
Hyderabad
Tollywood
Rajamouli

More Telugu News