Kalyani: మెగా ఫోన్ పట్టుకోనున్న హీరోయిన్ కల్యాణి

Actress Kalyani to direct film
  • సొంత బ్యానర్ లో దర్శకురాలిగా కల్యాణి
  • ఇంతకు ముందే నిర్మాతగా మారిన సీనియర్ హీరోయిన్
  • తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న చిత్రం
ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులకు ఆకట్టుకున్న కల్యాణి ఇప్పుడు డైరెక్టర్ గా కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించబోతున్నారు. తన సొంత బ్యానర్ లోనే ఆమె సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేరళకు చెందిన కల్యాణి 'శేషు' సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. రవితేజ చిత్రం 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'తో ఆమెకు మంచి పేరు వచ్చింది.

ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో ఆమె నటించారు. నటిగా ఉండగానే నిర్మాతగా కూడా మారారు. ఆ తర్వాత ఇటీవలనే నటిగా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పుడు డైరెక్టర్ కాబోతున్నారు. తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.
Kalyani
Tollywood
Director

More Telugu News