Kasireddy Rajendranath Reddy: ఏపీ డీజీపీగా ఈరోజు బాధ్యతలను స్వీకరించనున్న రాజేంద్రనాథ్ రెడ్డి

  • నేటితో ముగియనున్న గౌతమ్ సవాంగ్ పదవీకాలం
  • రాజేంద్రనాథ్ రెడ్డి 1992 ఐపీఎస్ అధికారి
  • ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమితులు కానున్న సవాంగ్
Kasireddy Rajendranath Reddy to take charge as AP DGP today

ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించనున్నారు. డీజీపీగా ఈరోజుతో గౌతమ్ సవాంగ్ పదవీకాలం ముగియనుంది. సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవిని చేపట్టనున్నారు. సవాంగ్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాల మీద 'డీమ్డ్ టు బి రిటైర్డ్' ఫైలును తయారు చేసింది. అంటే ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఆయన నియమితులు అయిన వెంటనే... ఆయన రిటైర్ అయినట్టు భావిస్తారు. ఈ ఫైల్ కు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేశారు.

ఈరోజు గౌతమ్ సవాంగ్ కు మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి.

More Telugu News