Kalyani: తొలిసారిగా మెగాఫోన్ పడుతున్న సీనియర్ హీరోయిన్!

Kalyani became as a Director
  • హీరోయిన్ గా అలరించిన కల్యాణి
  • పెళ్లి తరువాత వచ్చిన గ్యాప్
  • కొంతకాలం క్రితమే రీ ఎంట్రీ
  • సొంత బ్యానర్లో సినిమాకి దర్శకత్వం
తెలుగు తెరపై అందమైన చిరునవ్వుతో ఆకట్టుకున్న నిన్నటితరం కథానాయికలలో కల్యాణి ఒకరుగా కనిపిస్తుంది. కేరళలో పుట్టిపెరిగిన కల్యాణి మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలలో చేసింది. ఆ తరువాత హీరోయిన్ గా మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ భాషా చిత్రాలలోను నటించింది.

'శేషు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కల్యాణి, 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇక్కడ జగపతిబాబుతో ఆమె ఎక్కువ సినిమాలు చేసింది. వివాహమైన తరువాత కొంతకాలం పాటు సినిమాలకి దూరంగా ఉన్న ఆమె, ఆ తరువాత నిర్మాతగా మారింది. తన వయసుకి తగిన పాత్రలతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. 

రీసెంట్ గా కల్యాణి డైరెక్టర్ గా మారింది. తొలిసారిగా మెగా ఫోన్ పట్టి తన సొంత బ్యానర్లో ఆమె ఈ సినిమా చేస్తోంది. చేతన్ చీను హీరోగా ఆమె ఈ సినిమాను రూపొందిస్తోంది. 'రాజుగారి గది' .. 'మంత్ర 2' సినిమాలలో ఆయన నటించాడు. కల్యాణి దర్శక నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాను తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల చేస్తారట.
Kalyani
Kollywood

More Telugu News