Andhra Pradesh: ఏపీలో కొత్తగా 495 కొవిడ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 22,383 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 106 కొత్త కేసులు
- చిత్తూరు జిల్లాలో ఒకరి మృతి
- ఇంకా 8,421 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 22,383 శాంపిల్స్ పరీక్షించగా, 495 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 106 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 99, కృష్ణా జిల్లాలో 77 కేసులు వెల్లడయ్యాయి. విశాఖపట్నంలో 55, గుంటూరులో 40, ప్రకాశం జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 31 కేసులను గుర్తించారు.
అదే సమయంలో 1,543 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,15,525 మంది కరోనా బారినపడగా, వారిలో 22,92,396 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,421 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,708కి పెరిగింది.