Nagavamsi: నా సోదరులుగా భావించడం వల్లే ప్రేక్షకులను ఏకవచనంలో సంబోధించాను: నిర్మాత నాగవంశీ వివరణ

Tollywood produces Nagavamsi gives explanation on his recent comments
  • ఇటీవల డీజే టిల్లు చిత్రం రిలీజ్
  • తన వ్యాఖ్యలతో ప్రేక్షకులు బాధపడినట్టు తెలిసిందన్న నాగవంశీ 
  • క్షమించాలంటూ ప్రకటన విడుదల
  • ప్రేక్షకులే తమ బలం అని ఉద్ఘాటన
సితార ఎంటర్టయిన్ మెంట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. డీజే టిల్లు చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించినట్టు తెలిసిందని, అందుకు తాను బాధపడుతున్నానని తెలిపారు.

'ప్రేక్షకులను నా సోదరులుగా భావించడం వల్లే వారిని ఏకవచనంతో సంబోధించాను' అని వివరణ ఇచ్చారు. అయినా వారి మనసు నొచ్చుకోవడం పట్ల క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు.

"ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం. ఏ చిత్ర నిర్మాణ సంస్థకైనా వారే బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామని డీజే టిల్లు రిలీజ్ సందర్భంగా వ్యాఖ్యానించాను. మీడియాతో అన్న మాటలు ప్రేక్షకులను బాధించాయని తెలిసింది. అందుకు క్షంతవ్యుడను. ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం అని మరోసారి చెబుతున్నాను, వారే మా బలం" అంటూ నాగవంశీ వివరించారు.
Nagavamsi
Audience
Comments
DJ Tillu
Tollywood

More Telugu News