Akash Puri: 'చోర్ బజార్' నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ ప్రోమో!

Chor BaZaar Song Promo
  • ఆకాశ్ పూరి హీరోగా 'చోర్ బజార్'
  • దర్శకుడిగా జీవన్ రెడ్డి
  • సంగీత దర్శకుడిగా సురేశ్ బొబ్బిలి 
  • కథానాయికగా గెహనా సిప్పీ    
ఆకాశ్ పూరి హీరోగా నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకూ మాస్ యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేసుకుంటూ వచ్చిన ఆయన, ఈ సారి 'చోర్ బజార్'తో ఊరమాస్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. వీఎస్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి, 'జార్జిరెడ్డి' డైరెక్టర్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ ను రేపు ఉదయం 9:06 గంటలకు వదలనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. రేపు రిలీజ్ కానున్నది టైటిల్ సాంగ్ అనే విషయం ప్రోమోను బట్టి తెలుస్తోంది.

ఈ సినిమాలో ఆకాశ్ జోడీగా గెహనా సిప్పీ పరిచయం కానుంది. ఆకాశ్ పూరి ఇంతవరకూ చేసిన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. డాన్సుల్లోను .. ఫైట్స్ లోను ఓకే అనిపించుకున్నాడు. ఇక సరైన హిట్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. అలాంటి ఒక హిట్ ను ఈ సినిమా ఇస్తుందేమో చూడాలి. 

Akash Puri
Gehana Sippi
Jeevan Reddy
Chor Bazaar Movie

More Telugu News