Veera Yodha: కేసీఆర్ పుట్టినరోజుకు సంబంధించిన 'వీర యోధ' పాటను పంచుకున్న కేటీఆర్

KTR shares Veera Yodha song on KCR Birthday
  • నేడు కేసీఆర్ జన్మదినం
  • రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సంబరాలు
  • వీరయోధ వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ దళం సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో, కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రూపొందిన వీరయోధ అనే పాటను మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచుకున్నారు.

కేసీఆర్ జన్మదినం సందర్భంగా రూపొందించిన 'వీర యోధ' పాట ఉద్వేగభరితంగా ఉందని పేర్కొన్నారు. "భారతీయతే మనకు ప్రాణం... అది కేసీఆర్ హృదయనాదం... నీవెంట నిలుస్తాం, నడుస్తాం... గెలుస్తామయా" అంటూ ఈ గీతం సాగుతుంది. 'వీర యోధ' పాటకు సంబంధించిన వీడియోను కూడా కేటీఆర్ పంచుకున్నారు. ఈ పాటకు అభిజ్ఞ రచన, గానం అందించగా... ఎస్కే బాజి సంగీతం అందించారు. కె.లక్ష్మణ్ నిర్మాణంలో పూర్ణ దర్శకత్వం వహించారు.
Veera Yodha
Birthday Song
KCR
KTR
TRS
Telangana

More Telugu News