Roja: నగరి నియోజకవర్గం మొత్తాన్ని బాలాజీ జిల్లాలో ఉంచాలి: వైసీపీ ఎమ్మెల్యే రోజా

Nagari constitution should be kept in Balaji district
  • కొంత భాగం బాలాజీ జిల్లా, మరికొంత భాగం చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం
  • దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న రోజా
  • జగన్ కు వినతిపత్రాన్ని అందిస్తానని వ్యాఖ్య
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. జిల్లాల పేర్లు మార్చాలని, తమ ప్రాంతాలను ఇతర జిల్లాల్లో కలపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా తన నియోజకవర్గం నగరి గురించి తాజాగా స్పందించారు.

తన నియోజకవర్గం నగరి ప్రధానంగా కొత్తగా ఏర్పడబోయే బాలాజీ జిల్లాలో ఉందని... మరికొంత చిత్తూరు జిల్లాలో ఉంటుందని ఆమె తెలిపారు. రెండు జిల్లాల్లో నియోజకవర్గం ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు కూడా తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. మొత్తం నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలోనే కలపాలని ఆమె కోరారు. ఇందుకోసం ఓ వినతిపత్రాన్ని సీఎం జగన్ కు అందజేస్తామని చెప్పారు.
Roja
Jagan
YSRCP
Balaji District

More Telugu News