Nara Lokesh: జగన్ ఎవరో ఇక్కడ ఎవరికీ తెలియదని చెప్పడం మీ స్పీచ్ కే హైలైట్: మంత్రి గౌతమ్ రెడ్డిపై లోకేశ్ సెటైర్లు

Nara Lokesh satires on Mekapati Goutham Reddy
  • దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ షోలో మూడు ఒప్పందాలు జరిగాయన్న గౌతమ్ రెడ్డి
  • ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారని లోకేశ్ ఎద్దేవా
  • ఉన్న కంపెనీలు పోకుండా చూడండి చాలంటూ సెటైర్

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి యూఏఈలో ఉన్న సంగతి తెలిసిందే. దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షోలో మూడు కీలక ఒప్పందాలు జరిగాయంటూ గౌతమ్ రెడ్డి చెప్పడంపై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్ వేశారు. ఖాళీ కుర్చీలకి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా గౌతమ్ రెడ్డి గారు? అని ఆయన ప్రశ్నించారు. పైగా సీఎం జగన్ గురించి పెద్దగా ఇక్కడ ఎవరికీ తెలియదని సెలవివ్వడం మీ స్పీచ్ కే హైలైట్ అని ఎద్దేవా చేశారు.

చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న కంపెనీలు మీ ఘనత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అందుకే ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని విమర్శించారు. కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకెలాగూ చేతకాదని... కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అదే పదివేలు అని అన్నారు.

  • Loading...

More Telugu News