జగన్‌ను క‌లిసిన ఏపీ కొత్త డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

kasireddy meets jagan
  • తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో క‌లిసిన రాజేంద్రనాథ్ రెడ్డి 
  • శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి 
  •  1992∙బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ పదవి నుంచి గౌతం సవాంగ్ ను బదిలీ చేసిన ప్ర‌భుత్వం ఆయ‌న స్థానంలో ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని నియమించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జగన్‌ను రాజేంద్రనాథ్‌ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ శుభాకాంక్షలు తెలిపారు. 1992∙బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్నారు. కాగా, గౌతమ్‌ సవాంగ్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని ప్ర‌భుత్వం ఆదేశించిన విష‌యం తెలిసిందే.

Go Back to Shorts
kasireddy
AP DGP
Jagan

More Telugu News