Medaram: మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్లాలనుకుంటున్నారా... రేట్ల వివరాలు ఇవిగో!

  • రేపటి నుంచి మేడారం జాతర
  • హెలికాప్టర్లు నడపనున్న తంబి ఏవియేషన్
  • హనుమకొండ నుంచి మేడారంకు హెలికాప్టర్లు
  • రానుపోను ఒక్కొక్కరికి రూ.19,999
Helicopter services to Medaram Jatara

ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనుండడం తెలిసిందే. ఇక్కడ నిర్వహించే సమ్మక్క-సారలమ్మ వేడుకలు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవాలుగా పేరుగాంచాయి. కాగా, మేడారం జాతరకు వెళ్లేవారికోసం హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. తంబి ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ హెలికాప్టర్ సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.

హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్లు నడపనుంది. ఒకరికి రానుపోను చార్జీలు రూ.19,999 అని వెల్లడించారు. అదే, హైదరాబాద్ నుంచి మేడారంకు రూ.75,000 చెల్లించాలి. మేడారం జాతర విహంగ వీక్షణం కోసం మరో రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు షురూ అవుతాయి.

More Telugu News