Ghani: ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరుణ్ తేజ్ 'గని'

Varun Tej Ghani set releases this February
  • వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా గని
  • కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చిత్రం
  • కొన్నాళ్లుగా వాయిదా పడుతోన్న విడుదల
  • ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారు 
  • థియేటర్లలో కలుసుకుందామన్న వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'గని'. ఎట్టకేలకు ఈ చిత్రం రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఇవాళ నిర్ధారించింది. 'గని' ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించింది. మూడేళ్ల పాటు పడిన కష్టానికి ప్రతిఫలం అందుకునే సమయం వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంటామన్న నమ్మకం ఉందని హీరో వరుణ్ తేజ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 25న థియేటర్లలో కలుసుకుందాం అంటూ ట్వీట్ చేశారు.

అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయిక. సునీల్ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.
Ghani
Varun Tej
Release
Kiran Korrapati

More Telugu News