Balakrishna: జగన్ ను కలవను: బాలకృష్ణ

I will not meet Jagan says Balakrishna
  • జగన్ ను కలిసేందుకు రావాలని నన్ను పిలిచారు
  • టికెట్ ధరలు తక్కువ ఉన్నప్పుడే 'అఖండ' ఘన విజయం సాధించింది
  • నా సినిమా బడ్జెట్ ను నేను పెంచనన్న బాలకృష్ణ 
ఏపీ సీఎం జగన్ ను తాను కలవనని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇప్పట్లో ఆయనను కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ను కలవడానికి రావాలని తనను పిలిచారని... అయినా తాను వెళ్లలేదని చెప్పారు.

టికెట్ ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే తన తాజా చిత్రం 'అఖండ' ఘన విజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టిందని తెలిపారు. తన చిత్రాలు లిమిటెడ్ బడ్జెట్లోనే ఉంటాయని, టికెట్ ధరలు తన చిత్రాలపై ప్రభావం చూపబోవని అన్నారు. తన సినిమాల బడ్జెట్ ను తాను పెంచనని చెప్పారు. కొన్నిరోజుల క్రితం జగన్ ను చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కలిసిన సంగతి తెలిసిందే. ఈరోజు సీఎంతో మంచు విష్ణు భేటీ అయ్యారు.
Balakrishna
Tollywood
Telugudesam
Jagan
YSRCP

More Telugu News