Tulasi Reddy: 'హోదా' కాంగ్రెస్ పేటెంట్.. ప్రధానిగా రాహుల్ గాంధీ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే: తుల‌సిరెడ్డి

tulasi reddy on special status
  • ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం
  • హోదాను తెచ్చే శ‌క్తి వైసీపీ, టీడీపీ, జనసేనకు లేదు
  • ప్రాంతీయ పార్టీలు ఒట్టిమాట‌లు మాత్ర‌మే చెబుతాయి
  • 2024 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి
  • ఏపీకి ప్రత్యేక హోదా పొందాలన్న తులసిరెడ్డి 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కీలక వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు ఆయ‌న అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా అనే అంశం ముగిసిన అధ్యాయమంటూ బీజేపీ మోసం చేసిందని అన్నారు. ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనకు ప్రత్యేక హోదా తెచ్చే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదని ఆయ‌న విమ‌ర్శించారు.  

ప్రాంతీయ పార్టీలు ఒట్టిమాట‌లు మాత్ర‌మే మాట్లాడ‌తాయ‌ని అన్నారు. ప్రాంతీయ పార్టీల ఉచ్చులో ప్ర‌జ‌లు ప‌డ‌కూడ‌ద‌ని ఆయ‌న సూచించారు. 2024 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని, ఏపీకి ప్రత్యేక హోదా పొందాలని ఆయ‌న అన్నారు. ప్రధానిగా రాహుల్ గాంధీ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే పెడ‌తార‌ని ఆయ‌న చెప్పారు. త‌మ‌ పార్టీ మాట మీద నిల‌బ‌డుతుంద‌ని అన్నారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ఆయ‌న చెప్పారు. హోదా కాంగ్రెస్ పేటెంట్, అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టం అన్నారు.
Tulasi Reddy
Congress
Rahul Gandhi

More Telugu News