CM Jagan: పార్టీ కార్యకర్త పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్... వీడియో ఇదిగో!

CM Jagan attends party worker wedding reception
  • వైపీపీ కార్యకర్త సాయి ప్రశాంత్ వివాహం
  • విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్

ఓ సాధారణ కార్యకర్త వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవడం నిజంగా విశేషమే. సీఎం జగన్ ఇవాళ వైసీపీ కార్యకర్త సాయి ప్రశాంత్ వివాహ రిసెప్షన్ కు హాజరై పెళ్లింట మరింత సంతోషం నింపారు. వైసీపీ కార్యకర్త సాయి ప్రశాంత్ వివాహం శరణ్యతో జరిగింది. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ను ఈ పెళ్లి వేడుకకు ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. రిసెప్షన్ కు హాజరై సాయి ప్రశాంత్, శరణ్యలను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోని వైసీపీ సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Loading...

More Telugu News