CM Jagan: రేపు రైతుల ఖాతాల్లో ఇన్ పుట్ సబ్సిడీ... సీఎం జగన్ నిర్ణయం

CM Jagan will release input subsidy tomorrow
  • 2021 నవంబరులో భారీ వర్షాలు, వరదలు
  • నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ నిర్ణయం
  • మొత్తం రూ.534.77 కోట్లు విడుదల
  • రేపు ఉదయం 11 గంటలకు నిధుల విడుదల
గతేడాది నవంబరులో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయంచింది. సీఎం జగన్ రేపు రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ నిధులు జమ చేయనున్నారు. మొత్తం రూ.534.77 కోట్లు విడుదల చేయనున్నారు. దీని ద్వారా 5.71 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. రేపు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి ఒక్క బటన్ క్లిక్ తో రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాలను బదిలీ చేయనున్నారు.
CM Jagan
Input Subsidy
Farmers
Andhra Pradesh

More Telugu News