Night Curfew: ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేత... సీఎం జగన్ ఆదేశాలు

  • ఏపీలో తగ్గుతున్న కరోనా రోజువారీ కేసులు
  • తాజాగా 434 కొత్త కేసులు
  • పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్
  • వివరాలు సీఎంకు నివేదించిన అధికారులు
  • ఫీవర్ సర్వే ఆపొద్దన్న సీఎం జగన్
CM Jagan orders to lift night curfew in AP

ఏపీలో కరోనా పరిస్థితులు, వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ప్రజలందరూ కరోనా నియమావళి, మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. దుకాణాల వద్ద, షాపింగ్ మాల్స్ లో ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ఏపీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయడం తెలిసిందే.

కాగా, ఏపీలో గత రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజా  బులెటిన్ లో 434 కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించారు. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే కొత్త కేసులు వచ్చాయి. కేసులు తక్కువగా వస్తున్న అంశాన్ని అధికారులు నేటి సమీక్షలో సీఎం జగన్ కు వివరించారు.

దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశించారు. లక్షణాలు ఉన్నవారికి కరోనా పరీక్షలు చేయించాలని సూచించారు.

More Telugu News